ఈ జాగ్రత్తలు అవసరమే

0
164

ఖరీదైన మేకప్ సామాగ్రిని వాడుతూ , అలంకరణకు కొంత సమయం కేటాయించుకున్నప్పుడే అందంగా కనిపిస్తామన్నది చాలామంది అభిప్రాయం. వాస్తవానికి అవేమి అవసరం లేదు.ఎప్పటికప్పుడు కనిపించే చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటే చాలు. చమక్కున మెరిసిపోవచ్చు.

నలుగురిలోకి వెళ్ళినప్పుడు అందరు ముఖాన్నే చూస్తారనుకుంటాం. దాంతో కేవలం ముఖాన్నే వీలైనంత అందంగా కనిపించేలా చేసేందుకే ఎంతో శ్రద్ధ తీసుకుంటాం. ఆ క్రమంలో చేతి, కాలి గోర్లను నిర్లక్ష్యం చేస్తాం. ఎవరు పట్టించుకుంటారనుకుంటాం. కానీ చాలామంది వాటిని కూడా గమనిస్తారు. షేక్   హ్యాండ్ ఇవ్వడానికి చేతులు కలపాల్సి రావచ్చు. పెన్నుతో ఏదైనా రాయాల్సి రావచ్చు. అలాంటప్పుడు గోళ్లలో మట్టి, సగం గోళ్ల రంగు మాత్రమే ఉండటం లేదా అవి విరిగిపోవడం లాంటివన్నీ మీరు వ్యక్తిగత శుభ్రతను తేలిగ్గా తీసుకుంటారనే సంకేతాన్ని అందిస్తాయి. అందుకే వాటి విషయంలోనూ జాగ్రత్త గ ఉండాలి.

ముఖంపై అవాంఛిత రోమాలుండటం కూడా సహజ అందాన్ని తగ్గిస్తుంది. అయితే వాటిని తొలగించుకునేందుకు లేజర్ లాంటి చికిత్సలు చేయించుకోలేకపోవచ్చు. అలాగని వదిలేయాలని లేదు. బ్లీచింగ్ ని ఎంచుకోవచ్చు. ఈ రోజుల్లో బ్లీచింగ్ కిట్లు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వాడితే అవాంఛిత రోమాలని ఎక్కువగా కనిపించనివ్వకుండా చేయవచ్చు.

Bleaching kits : http://www.breaktheq.com/Categories/personal-care/bleach-creams

కొందరు ముందు గమనించుకోకుండా నచ్చిన రంగు ఫౌండేషన్ ని ఎంచుకుంటారు. అయితే చర్మ తత్వానికి నప్పే ఫౌండేషన్ ఎంచుకోకపోతే ఆ తేడా ముఖంపై స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే కొనేముందు అది మీకు నప్పుతుందా లేదా అని పరీక్షించుకోవాలి.

ప్రత్యేక సందర్భాలకు సంబంధించి బయటకు వెళ్తున్నప్పుడు తల జిడ్డుగా వున్నా సరే అలాగే వెళ్లిపోతుంటారు చాలామంది. అయితే అన్నిసార్లు తలస్నానం చేసే సమయం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు డ్రై షాంపూ లేదా కండీషనర్ ని ఎంచుకోవాలి. దానివలన తలలో జిడ్డు తగ్గుతుంది.

Shampoos and conditioners : http://www.breaktheq.com/Categories/personal-care/hair-care

NO COMMENTS