ఈ పూతల్ని ముఖానికి తగిలించుకోవచ్చు

0
299

ముఖం తేమతో కళకళలాడేందుకు మనం రకరకాల పూతలు వేస్తుంటాం. కానీ అవి వేయడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటికి సంబంధించిన పదార్థాలన్నీ తీసుకుని మెత్తని గుజ్జుగా చేసుకుని ముఖానికి వేసుకోవాలి. ఆరేంత వరకూ ఆగి ఆ తర్వాత నీళ్లతో కడుక్కోవాలి. ఇదంతా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం. కానీ ఇంత హంగామా లేకుండా సులువుగా వేసుకోగలిగిన పూతలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవే డ్రైమాస్క్‌లు. ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా తేలిగ్గా ముఖానికి మాస్క్‌ వేసుకునేలా బజార్లో ఇప్పుడవి దొరుకుతున్నాయి. ఈ డ్రైమాస్క్‌లు బ్యాగులో పెట్టుకుని వెళ్లడానికి వీలుగా ఉంటాయి. చూడ్డానికి పల్చని వస్త్రంలా కనిపించే ఈ షీట్లని ముఖంలో ఏ భాగానికి కావాలనుకుంటే ఆ భాగానికి వేసుకోవచ్చు. నుదురూ, చెంపలూ, చెవులూ, మెడ భాగాలను విడివిడిగానూ వేసుకోవచ్చు. ఈ మాస్క్‌లో 85 శాతం నీరూ, కొద్దిగా గ్లిజరిన్‌ ఉంటుంది. వీటివల్ల ఒక రోజంతా ముఖం తేమతో కళకళ్లాడుతుందని అంటున్నారు తయారీదారులు.

NO COMMENTS