కూర్చున్నా.. అలసట తప్పదు!

0
274
Handsome businessman working with laptop in office

కార్యాలయంలో ఉన్న ఎనిమిది గంటలు కష్టపడి పనిచేయడం మంచిదే. కానీ.. మనం తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు.. పని వాతావరణంలో అలసిపోయేలా చేస్తాయి. అవేంటంటే..

నెట్‌ చూస్తున్నారా: ఇంటికొచ్చాక విశ్రాంతి పేరుతో నెట్‌ కి అతుక్కుపోతాం. సెల్‌ఫోన్లోనో, ఐపాడ్‌లోనో సినిమాలు చూస్తాం. ఆ ప్రభావం మన నిద్రపై పడుతుంది. మగత నిద్రపోతాం. దాంతో మర్నాడు కార్యాలయంలో అలసిపోతాం. అందుకే నిద్రపోయేందుకు గంట ముందు ఎలక్ట్రానిక్‌ పరికరాలకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి.

వెలుతురు లేకుండా: ఈ రోజుల్లో కంప్యూటరుతోనే ఎక్కువగా పనిచేస్తున్నాం. దానికితోడు సరైన వెలుతురు కూడా లేకపోతే ఆ ప్రభావం కళ్లపై పడుతుంది. పెద్ద నష్టం ఉండకపోవచ్చు కానీ కళ్లు త్వరగా అలసిపోతాయి. అందుకే వెలుతురు బాగా పడే వాతావరణం మీ చుట్టూ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది.

అదేపనిగా కూర్చోవడం: ఆఫీసుకు వెళ్లింది మొదలు.. గంటలతరబడి కూర్చుని పనిచేస్తుంటాం. దానివల్ల బరువు పెరగడం ఒక్కటే కాదు.. శక్తి కూడా తగ్గుతుంది. అలా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల త్వరగా అలసిపోతుంటాం. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా నిల్చునేందుకు ప్రయత్నించండి. సహోద్యోగులతో మాట్లాడాల్సి వస్తే.. ఫోను చేయకుండా వాళ్లు కూర్చున్న చోటికి వెళ్లేలా చూసుకోండి. దానివల్ల కాస్త సమయం వృథా అయినా సరే.. కొన్ని నిమిషాలయినా నడిచిన వారవుతారు.

విరామం తీసుకోకపోవడం: అలసిపోవడానికి మరో కారణం పని మధ్యలో విరామం తీసుకోకపోవడం. దానివల్ల మన మెదడుపై భారం పడి.. క్రమంగా ఒత్తిడి మొదలవుతుంది. దాంతో అలసట తప్పదు. అందుకే ఎంత తీరిక లేకపోయినా సరే.. అప్పుడప్పుడూ విరామం తీసుకునేలా చూసుకోవాలి. అది ఐదు నిమిషాలయినా సరే ఎంతో సాంత్వన అందిస్తుంది. అలాగే పనిభారం ఎక్కువగా లేదనుకున్నప్పుడు ఒకటిరెండు రోజులు సెలవు తీసుకుని విశ్రాంతి తీసుకోవడం మంచిది.

NO COMMENTS