చలికాలంలో తేమ ఇలా

0
176

ఈ కాలంలో చర్మం పొడిబారడం, జుట్టు రాలడం వంటి సమస్యలెన్నో. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చక్కని ఫలితం వస్తుంది. ఈ కాలంలో జుట్టుకి మరీ ఎక్కువ కాకుండా తగినంత నూనె రాసుకోవాలి. కొబ్బరి నూనెలో కొన్ని కరివేపాకులు వేసి మరగనివ్వాలి. దాన్ని గోరువెచ్చగా వున్నప్పుడే మాడుకు పట్టించి మర్దన చేసి, అరగంటాగి తలస్నానం చేయాలి. ఇలా వారంలో 2 సార్లు చేయడం వాళ్ళ జుట్టుకు తగినంత తేమ అందుతుంది. అవసరమైన పోషకాలు లభించి చక్కగా ఎదుగుతుంది.

చలికాలంలో చర్మం పొడిబారి సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికి పరిష్కారం మీ చేతుల్లోనే వుంది. గోరువెచ్చని తేనె, బాదం నూనె కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికి పట్టించాలి. సహజంగా చర్మంలో ఇంకిపోయేలా చూసుకోవాలి. ఇలా చేయడం వాళ్ళ చర్మం పొడిబారడం తగ్గుతుంది. తాజాగా కనిపిస్తుంది.

NO COMMENTS