నిద్రలేమా…?

0
329

కొందరు ఎన్నో కారణాల వల్ల నిద్రలేమితో బాధపడుతుంటారు. అలాంటివారు రాత్రి నిద్రకుఉపక్రమించడానికి ముందు ఈ టీలు తాగి చూడండి..

remedyshops_mintపుదీనా: బాగా మరిగించిన వేణ్నీళ్లలో నాలుగు పుదీనా ఆకులు వేసి… కాసేపయ్యాక వడకట్టాలి. ఆ నీళ్లని నిద్రకు ముందు తాగితే జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. శరీరానికి రక్తప్రసరణ… సక్రమంగా ఉంటుంది. నిద్ర బాగా పడుతుంది. ప్రతిరోజూ తాగడం అలవాటు చేసుకుంటే నిద్రలేమి సమస్య దూరమవుతుంది.

stress-relieving-lavender-mint-teaలావెండర్‌: లావెండర్‌ వాసన చూస్తే చాలు ఆందోళన దూరమవుతుంటుంది. ఆ టీలోనూ ఒత్తిడి వ్యతిరేక కారకాలు ఎక్కువ. ఫలితంగా కుంగుబాటు,. మానసిక వ్యాకులత వంటివి దూరమవుతాయి. చక్కగా నిద్రపడుతుంది. ఆందోళనలు తగ్గుతాయి.

chamomile-teaచామోమైల్‌: చామంతి రేకలతో చేసిన టీనే చామోమైల్‌ టీ అంటారు. ఇది మానసిక అస్థిరతని దూరం చేస్తుంది. సహజంగా వర్షాకాలంలో కాస్త బద్ధకంగా అనిపిస్తుంది. ఈ టీ తాగడం వల్ల కొత్త హుషారొస్తుంది. నిద్రలేమి దరిదాపుల్లో ఉండదు.

NO COMMENTS