మేకప్‌ లేకుండానే మెరుపులు

0
130

కళ్ల అందాన్ని పెంచే మేకప్‌ సాధనాలు మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి. కానీ ఎలాంటి మేకప్‌ లేకుండానే కళ్లు అందంగా కనబడితే మంచిదే కదా… మేకప్‌ నిపుణులు అందిస్తున్న ఈ చిట్కాలతో సౌందర్య సాధనాలు వాడకుండానే కళ్లు అందంగా ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంటాయి-
1. చల్లని నీళ్లను కళ్లు, మొహంపై చల్లుకోవడం వలన కళ్లు స్వచ్ఛంగా శుభ్రంగా ఉంటాయి. ఊరికే కడగడమే కాకుండా కాస్త ఎక్కువ సమయం ఇలా చేయడం వలన మరింత ప్రయోజనం ఉంటుంది.
2. చల్లని టీ బ్యాగులను కంటి రెప్పలపై ఉంచడం వలన కంటి చుట్టూ చర్మం బిగుతుగా మారుతుంది.
3. నిద్రలేని కళ్లు నిర్జీవంగా కనబడతాయి. ఎనిమిది గంటల నిద్ర, కంటికి విశ్రాంతి ఉంటే కళ్లు అలసటగా కనిపించవు.
4. కనుబొమలను అందంగా, క్రమపద్ధతిలో కనిపించేలా చేయడం వలన కూడా కళ్లు అందంగా కనబడతాయి.
5. ఎక్కువ మంచినీళ్లు తాగటం, పళ్లు, కూరగాయలు, ఆకుకూరలు తగినంత తీసుకోవడం తప్పనిసరి.
6. కనురెప్పలకు కాస్త పెట్రోలియం జెల్లీని రాయడం వలన అవి నిగనిగలాడతాయి.
7. కళ్లు మూసి రెప్ప పైభాగంలో ముఖానికి రాసే ఫేస్‌ క్రీమ్‌ రాయడం ద్వారా ఆ భాగంలో చర్మం మెరుస్తుంది.

Fairness-Creams-Gels : http://www.breaktheq.com/Categories/personal-care/fairness-creams-gels

NO COMMENTS