మేకప్ తో ముఖం సన్నగా కనిపించేలా చేసే చిట్కాలు

0
157

మేకప్ లేకుండా ప్రముఖుల ఫోటోలను చూస్తే మనం ఆశ్చర్యానికి గురవక తప్పదు ” ఇంటర్నెట్ పోస్ట్ లలో చక్కర్లు కొట్టే ఈ ఫోటోలను చూసినపుడు ప్రముఖులు నిజంగా దేవుని ద్వారా పరిపూర్ణంగా తీర్చిదిద్దబడ్డారు అని నమ్మే ప్రజలు తీవ్ర ఆశ్చర్యానికి లోనవుతారు. కొన్ని పద్ధతుల ద్వారా ముఖ స్వరూపాన్ని మార్చవచ్చు అని మేకప్ లేకుండా గుర్తించలేని ముఖాలతో నిరూపించవచ్చు. మీరు కూడా మీ చేతులతోనే మీ అందమైన ముఖాన్ని కొన్ని ఉపాయాలు మరియు చిట్కాలు ఉపయోగించటం ద్వారా తక్షణమే సన్నగా కనిపించేలా మార్చుకోవచ్చు.

మీ ముఖానికి కాంటౌర్ లైన్ వేయుట

కళాకారులు ఏవిధంగా ఐతే ముదురు రంగు షేడ్స్ తో లక్షణాలను వెనుకకు పట్టేలా చేసి మరియు తేలికపాటి షేడ్స్ తో ఎక్కువగా కనిపించేలా ఎలా చేస్తారో ఎపుడైనా గమనించారా? మీరు ఈ కళ యొక్క ఉద్దేశంను ఉపయోగించి (మీ నిజ జీవితంలో) మీ ముఖం పై సరిహద్దు గీతలను (కాంటౌర్ లైన్) వేస్తూ దాని ప్రయోజనం పొందవచ్చు. మీ చర్మ రంగు కన్నా ఎక్కువ రంగులో ఒకటి లేదా రెండు కాంటూర్ రంగుల లేదా మాట్ బ్రోంజర్ షేడ్స్ ను మరియు మీ రంగు కంటే స్వల్ప తేలికగా ఉండే హైలైటర్స్ ను ఎంచుకోండి. మీరు క్రీమ్ లేదా పౌడర్స్ లలో ఏదైనా ఎంచుకోవచ్చు లేదా రెండిటి కలయికను కూడా ఎంచుకోవచ్చు. మీరు ఉపయోగించే ఫార్ములాతో సంబంధం లేకుండా, మేకప్ బ్రష్ ను ఉపయోగించి సరిగా కలపాలి ఎందుకంటే చారలుగా వచ్చే కాంటౌర్ మేకప్ అందంగా రాకపోవడానికి ఒక ప్రధాన కారణమవుతుంది.

భ్రమను సృష్టించడం

మీ చెంపను కేంద్రంగా చేసుకొని చెవికి పైన వైపుగా డైగ్నల్ లైన్ లో కాంటౌర్ షెడ్స్ ను వేయాలి. మీరు సెల్ఫీస్ దిగేపుడు ముఖం ఎలా పెడుతారో అలా, బుంగ మూతి పెట్టడం ద్వారా, మీ చెంప పై షెడ్స్ వేయడానికి ఒక ఖచ్చితమైన స్థలాన్ని గుర్తించవచ్చు మరియు వేసుకోవడానికి సులువుగా ఉంటుంది. సరిగా కలపడం మరిచిపోకండి. కాంటౌర్ షేడ్స్ ను ఎక్కువగా వేసుకోవడం ద్వారా మీ దవడ ఎముకలు పదునుగా కనిపిస్తాయి. దవడ ఎముకల పై భాగమంతటా హైలైటర్ ను స్వైప్ చేస్తూ కాంటౌర్ బయట వరకు తీసుకురావాలి.

ముక్కును సన్నగా మరియు గదవ భాగం పదునుగా కనిపించడం కోసం

మీ ముక్కు సన్నగా కనిపించడానికి ముక్కు మధ్య భాగం వంతెనకు ఇరు ప్రక్కల కాంటౌర్ పౌడర్ ను దిగువకు స్వైప్ చెయ్యాలి. దీనిని ముక్కుపుటల వద్ద ఆపేయాలి. మీ ముక్కు మధ్య భాగ వంతెన పై హైలైటర్ ను దిగువ వైపుకు వేయాలి మరియు మిశ్రమం సరిగా కలుపడం ద్వారా దాని పూర్తి ప్రభావం పొందగలం.

పదునైన గదవ భాగం కోసం, ఆ ప్రాంతం మొత్తం బ్రోంజర్ ను వేసుకోవాలి మరియు కాంటౌర్ షేడ్ అతుకులు లేకుండా రావడానికి మిశ్రమంను సరిగా కలుపాలి. మళ్ళీ ఎప్పుడైనా ఫోటోలు దిగేపుడు గదవను మడచినట్లుగా ఉంచడం గురించి ఇక మర్చిపొండి.
మీ కళ్ళు మరియు కనుబొమ్మలను హైలైట్ చేయడం

పెదవులు లావుగా కలిగి ఉంటే ముఖం నిండుగా కనిపిస్తుందని ఉద్ఘాటించి చెప్పవచ్చు కానీ మీ యొక్క చక్కని కళ్ళు మీ మిగిలిన ముఖంను చిన్నగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి, మీ కళ్ళను లైనర్, షాడో మరియు మాస్కరా లతో పెద్దగా చేయడం అనేది ఒక మంచి ఆలోచన. మీ పెదవులను సహజంగా కనిపించేలా లేతరంగు బామ్ లేదా గ్లోస్ పెట్టుకొని వదిలివేయండి.

Shadow and Mascara : http://www.breaktheq.com/Categories/personal-care/eye-care

మీ ముఖం సహజ స్వరూపం గురించి తెలియచేయటంలో మీ కనుబొమ్మలు కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మీ ముఖం నిండుదనాన్ని సమతుల్యం చేయడానికి కనుబొమ్మల వంపు అధికంగా ఉండేట్లు చేయాలి. ఇది మీ కళ్ళు పైన వైపు లాగినట్లుగా, నిలువు ఆకృతిలో కనిపించేలా సాగదీస్తుంది.

కాంతిని పెంపొందించుట

మీ ముఖం యొక్క మధ్య భాగంను, తర్వాత కను బొమ్మల మధ్య భాగాన్ని, ముక్కు మధ్య భాగాన వంతెన లాంటి ప్రాంతంను, ఎగువ పెదవి పైని భాగాన్ని, మరియు మీ గదవ భాగాన్ని హైలైట్ చేయాలి. ఇది మీ ముఖం వెడల్పును తక్కువగా కనిపించేలా చేస్తుంది.

మీ నుదురు, కనులు, చెవుల మధ్య గల స్థలంలో కలిపి ఉంచిన కాంటౌర్ షేడ్స్ ను వేయడం మరిచిపోకండి. మీ అస్థినిర్మాణంకు తగిన విధంగా కేశాల చుట్టూ మరోసారి పునరావృతం చేయండి.

NO COMMENTS