వణికే చలిలో మేలైన స్క్రబ్స్

0
201

సీజన్ మారుతుంది. ఈ సమయంలో చర్మం తరచు పొడిబారుతుంది. మృత కణాలు పెరుగుతుంటాయి. చర్మానికి మాయిశ్చరైజింగ్ ఇచ్చే స్క్రబ్ ను ఉపయోగించాలి. ఇందుకోసం… కప్పు బ్రౌన్ షుగర్, అరకప్పు బాదాం నూనె, 2 చెంచాల తేనె, చెంచా వెనిలా ఎక్స్ట్రాక్ట్ ఒక పాత్రలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్ళతో తీసుకుని ముఖం, చేతులు, భుజాలు.. శరీరమంతా వలయాకారంగా రుద్దుతూ మస్సాజ్ చేసుకోవాలి. తరువాత స్నానానికి నలుగుపిండి ఉపయోగించాలి.

చెంచా ముల్తానీ మట్టి, చెంచా మీగడ, అరచెంచా తేనె, పావుచెంచా బాదంనూనె పేస్ట్ లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా  వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి. రోజు చర్మం పొడిబారకుండా, కాంతివంతంగా తయారవుతుంది.

Scrubs: http://www.breaktheq.com/Categories/personal-care/scrubs

NO COMMENTS